మిస్ వరల్డ్ కిరీటానికి అడుగు దూరంలో నిలిచిపోయిన భారత సంతతి యువతి

ABN , First Publish Date - 2022-03-18T13:33:50+05:30 IST

పోలాండ్‌కు చెందిన కెరోలైనా బిలోస్కా.. మిస్‌ వరల్డ్‌ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో గురువారం(భారత కాలమానం ప్రకారం) జరిగిన వేడుకలో 2019 మిస్‌ వరల్డ్‌ టోనీ ఆన్‌ సింగ్‌(జమైకా).. కెరోలైనాకు కిరీటాన్ని అలకరించారు. దీంతో కెరోలైనా 70వ మిస్‌ వరల్డ్‌గా నిలిచారు

మిస్ వరల్డ్ కిరీటానికి అడుగు దూరంలో నిలిచిపోయిన భారత సంతతి యువతి

మిస్‌ వరల్డ్‌ 2021గా కెరోలైనా బిలోస్కా

తొలి రన్నరప్‌గా భారత సంతతికి చెందిన శ్రీసైనీ11వ స్థానంలో నిలిచిన హైదరాబాదీ మానస

శాన్‌ జువాన్‌, మార్చి 17 : పోలాండ్‌కు చెందిన కెరోలైనా బిలోస్కా.. మిస్‌ వరల్డ్‌ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో గురువారం(భారత కాలమానం ప్రకారం) జరిగిన వేడుకలో 2019 మిస్‌ వరల్డ్‌ టోనీ ఆన్‌ సింగ్‌(జమైకా).. కెరోలైనాకు కిరీటాన్ని అలకరించారు. దీంతో కెరోలైనా 70వ మిస్‌ వరల్డ్‌గా నిలిచారు. భారత సంతతికి చెందిన అమెరికా యువతి శ్రీసైనీ తొలి రన్నర్‌పగా నిలువగా, ఒలియవా యాస్‌(కోట్‌ డి ఐవరీ) రెండో రన్నర్‌పగా నిలిచారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన వారాణసి మానస టాప్‌-6 రౌండ్‌కు చేరడంలో విఫలమై టాప్‌-13తో సరిపెట్టుకున్నారు.


పోలాండ్‌కు చెందిన 23 ఏళ్ల కెరోలైనా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమెకు మోడల్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈత, స్కూబా డైవింగ్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ను ఇష్టపడే కెరోలైనా.. సామాజిక కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటారు. బ్యూటీ విత్‌ పర్పస్‌ ప్రాజెక్టులో భాగంగా నిరాశ్రయుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు  భారత మూలాలున్న శ్రీసై నీ 2021 మిస్‌ వరల్డ్‌ తొలి రన్నర్‌పగా నిలిచారు. ఈ పోటీల్లో ఆమె అమెరికాకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీసైనీ పంజాబ్‌లోని లుధియానాలో జన్మించారు. శ్రీసైనీ ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం వాషింగ్టన్‌కు వెళ్లింది.



శ్రీసైనీ తన చిన్నతనంలో ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. వాటినన్నింటినీ అధిగమించి శ్రీసైనీ మిస్‌ వరల్డ్‌ అమెరికాగా నిలిచారు. మిస్‌ వరల్డ్‌ అవ్వాలన్న తన కలకు అడుగు దూరంలో నిలిచి రన్నర్‌పతో సరిపెట్టుకున్నారు. కాగా, హైదరాబాదీ వారాణసి మాసస మిస్‌ వరల్డ్‌ 2021 పోటీల్లో 11వ స్థానంతో సరిపెట్టుకున్నారు. టాప్‌-13లో చోటు దక్కించుకున్న మానస.. టాప్‌-6 రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు. హైదరాబాద్‌లో జన్మించిన మానస. చిన్నతనంలోని తన కుటుంబంతో కలిసి మలేషియా వెళ్లిపోయింది. అక్కడి గ్లోబర్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టెన్త్‌ గ్రేడ్‌ పూర్తి చేసిన తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు. వాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇం జనీరింగ్‌ పూర్తి చేశారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి 2020లో ఫెమీనా మిస్‌ ఇండియా విజేతగా నిలిచి న మానస.. అదే ఏడాది ఫెమీనా మిస్‌ ఇండియా వరల్డ్‌ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు.




Updated Date - 2022-03-18T13:33:50+05:30 IST