భారతీయ అమెరికన్ దంపతుల ఉదారత.. వైద్యరంగానికి రూ. కోటి విరాళం!

ABN , First Publish Date - 2021-03-30T20:25:01+05:30 IST

భారతీయ అమెరికన్ దంపతులు రమేష్, కల్పనా తమ ఉదారతను చాటుకున్నారు.

భారతీయ అమెరికన్ దంపతుల ఉదారత.. వైద్యరంగానికి రూ. కోటి విరాళం!

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ దంపతులు రమేష్, కల్పనా తమ ఉదారతను చాటుకున్నారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల వైద్యరంగానికి ఏకంగా కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు సోమవారం బిహార్ జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(బీజేఏఎన్ఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. రమేష్ అండ్ కల్పనా భాటియా ఫ్యామిలీ ఫౌండేషన్ నుంచి తమకు రూ. కోటి విరాళంగా అందినట్లు తన ప్రకటనలో పేర్కొంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వైద్యరంగం అభివృద్ధి కోసం దీనిని ఉపయోగించాలని ఫౌండేషన్ కోరినట్లు బీజేఏఎన్ఏ వెల్లడించింది. రమేష్, కల్పనా భాటియా దంపతుల ఉదార స్వభావం వల్లే ఇవాళ బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల వైద్యరంగానికి ఈ భారీ విరాళం దక్కినట్లు బీజేఏఎన్ఏ అధ్యక్షుడు అవినాష్ గుప్తా పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య సేవలకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఇక పాట్నాలోని ఎన్ఐటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన భాటియా ప్రస్తుతం టెక్సాస్‌లో విజయవంతంగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-03-30T20:25:01+05:30 IST