మరో ఇండియన్-అమెరికన్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన బైడెన్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-02-23T15:06:54+05:30 IST

బైడెన్ ప్రభుత్వం మరో ఇండియన్-అమెరికన్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది. వాతావరణ, విద్యుత్తు శాఖల్లో

మరో ఇండియన్-అమెరికన్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన బైడెన్ ప్రభుత్వం

వాషింగ్టన్: బైడెన్ ప్రభుత్వం మరో ఇండియన్-అమెరికన్‌కు కీలక బాధ్యతలను అప్పగించింది. వాతావరణ, విద్యుత్తు శాఖల్లో నిపుణురాలైన బిడీషా భట్టాచార్యను వ్యవసాయశాఖలోని కీలక స్థానంలో ప్రభుత్వం సోమవారం నియమించింది. బిడీషా గతంలో సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్‌లో వాతావరణ, విద్యుత్తు పాలసీ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు విలేజ్ క్యాపిటల్ అనే సంస్థలో ఎమర్జింగ్ మార్కెట్స్ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. అంతేకాకుండా కేపిటల్ హిల్‌లో మిన్నెసొటా సెనటర్‌ అల్ ఫ్రాంకెన్‌కు నాలుగేళ్ల పాటు సీనియర్ ఎనర్జీ అండ్ అగ్రికల్చర్ పాలసీ అడ్వైజర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. మరోపక్క భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తిని అమలు చేయడానికై సింపా నెట్‌వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీతో మూడేళ్ల పాటు బిడీషా పనిచేశారు. కాగా.. బిడీషా హార్వర్డ్ యూనివర్శిటీలో పబ్లిక్ పాలసీపై మాస్టర్స్, సెయింట్ ఆలఫ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచ్‌లర్స్ డిగ్రీని చేశారు.

Updated Date - 2021-02-23T15:06:54+05:30 IST