America లో భారతీయురాలికి కీలక పదవి.. తొలి మహిళగా రికార్డ్!

ABN , First Publish Date - 2021-10-13T17:51:58+05:30 IST

బెంగళూరుకు చెందిన భారతీయ అమెరికన్ మహిళా న్యాయవాది రమ్య జవహర్ కుదెకల్లు‌(32)కు కీలక పదవి దక్కింది.

America లో భారతీయురాలికి కీలక పదవి.. తొలి మహిళగా రికార్డ్!

న్యూయార్క్: బెంగళూరుకు చెందిన భారతీయ అమెరికన్ మహిళా న్యాయవాది రమ్య జవహర్ కుదెకల్లు‌(32)కు కీలక పదవి దక్కింది. న్యూయార్క్ సిటీ బార్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్పర్సన్‌గా రమ్య ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవికి ఎన్నికైన తొలి శ్వేతజాతి యేతర మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రమ్య ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. బెంగళూరులోనే పుట్టిపెరిగిన రమ్య విద్యాభ్యాసం ఊటీతో పాటు బెంగళూరులోనే కొనసాగింది. ఆ తర్వాత ఇంటర్నెషనల్ లా అండ్ జస్టిస్‌లో మాస్టర్స్ కోసం న్యూయార్క్ వెళ్లారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లోని కార్డోజో లా స్కూల్‌లో టీచింగ్ చేస్తున్నారు.


ఇక తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె వీధి విక్రేతలు, LGBTQ కమ్యూనిటీ సభ్యులు, సెక్స్ వర్కర్లు, మహిళలు, పిల్లల హక్కుల కోసం ఆమె ప్రత్యామ్నాయ లా ఫోరమ్ (ఏఎల్‌ఎఫ్)తో కలిసి పనిచేశారు. కాగా, తాజాగా తనకు దక్కిన ఈ కీలక పదవి పట్ల రమ్య ఆనందం వ్యక్తం చేశారు. ఈ నియామకం ఒక గొప్ప గౌరవం అని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా న్యూయార్క్ సిటీ బార్ అనేది అమెరికాలోని అతిపెద్ద న్యాయవాదుల సంఘాలలో ఒకటని.. వైవిధ్యమైన, బహుళ సాంస్కృతిక సభ్యత్వం నుండి ప్రయోజనం పొందుతున్నట్లు రమ్య చెప్పుకొచ్చారు.   

Updated Date - 2021-10-13T17:51:58+05:30 IST