Advertisement
Advertisement
Abn logo
Advertisement

హబ్‌స్పాట్‌కు సీఈఓగా భారతీయురాలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థకు భారతీయ అమెరికన్ మహిళ సీఈఓగా నియమితులయ్యారు. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో పేరొందిన హబ్‌స్పాట్‌కు సీఈఓగా భారతీయురాలు యామిని రంగన్ ఎన్నికయ్యారు. శాన్ ఫ్రాన్సిస్కో‌కు చెందిన యామిని.. బ్రియాన్ హల్లిగాన్ స్థానంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. బ్రియాన్ గత 15 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉండనున్నారు. ఇక గతేడాది చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా పదొన్నతి పొందిన యామిని.. ఈ ఏడాది సీఈఓగా నియామకం కావడం విశేషం. సెప్టెంబర్ 7న ఆమె అధికారికంగా ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, డ్రాప్‌బాక్స్‌ సంస్థలో పనిచేసి మానేసిన తర్వాత యామిని 2020 జనవరిలో హబ్‌స్పాట్‌ కంపెనీలో చేరారు. 2019లో ఆమె శాన్ ఫ్రాన్సిస్కో బిజినెస్ టైమ్స్ ద్వారా బిజినెస్‌లో అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు.      

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement