Advertisement
Advertisement
Abn logo
Advertisement

కువైత్‌లోని భారత రాయబారి కీలక ప్రకటన.. కరోనా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జ్.. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక ప్రకటన చేశారు. కరోనా వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ఇండిపెండెంట్స్ డే సందర్భంగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియను పరిశీలించడానికి ఇప్పటికే ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ.. మొదటి విడతలో భాగంగా 65 కుటుంబాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. కుటుంబానికి రూ.లక్ష పెద్ద మొత్తం కానప్పటికీ.. దీని ద్వారా వారికి కొంత ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. 120 కువైటీ దినార్ల కంటే తక్కవ వేతనం కలిగి ఉండి.. కువైత్‌లో కొవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలను టాస్క్ ఫోర్స్ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement