పాక్‌లో మన దౌత్యాధికారికి భయానక అనుభవం

ABN , First Publish Date - 2020-06-05T08:17:00+05:30 IST

పాకిస్థాన్‌లో భారత దౌత్య అధికారి గౌరవ్‌ అహ్లువాలియాకు భయానకమైన అనుభవం ఎదురైంది. ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆయన్ను ఆ దేశ నిఘా సంస్థ ఐఎ్‌సఐతో సంబంధాలున్న కొందరు వ్యక్తులు వెంబడించి భయపెట్టేందుకు...

పాక్‌లో మన దౌత్యాధికారికి భయానక అనుభవం

  • ఆయన కారును వెంబడించిన ఐఎ్‌సఐ వర్గాలు


న్యూఢిల్లీ, జూన్‌ 4: పాకిస్థాన్‌లో భారత దౌత్య అధికారి గౌరవ్‌ అహ్లువాలియాకు భయానకమైన అనుభవం ఎదురైంది. ఇంటి నుంచి కారులో బయలుదేరిన ఆయన్ను ఆ దేశ నిఘా సంస్థ ఐఎ్‌సఐతో సంబంధాలున్న కొందరు వ్యక్తులు వెంబడించి భయపెట్టేందుకు ప్రయత్నించారు. మన ఆర్మీ కి సంబంధించిన కీలక పత్రాలను కాజేసేందుకు యత్నించిన పాక్‌ రాయబార కార్యాలయంలోని ఇద్దరు అధికారులను మన నిఘా వర్గాలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని, ఆ దేశానికి తిప్పి పంపిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. 


Updated Date - 2020-06-05T08:17:00+05:30 IST