Kuwaitలోని భారతీయులపై ప్రశంసల వర్షం!

ABN , First Publish Date - 2022-06-15T16:05:37+05:30 IST

కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి ఆ దేశంలోని ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతీయులను హీరోలుగా అభివర్ణించారు. ఎన్నారైలు చేస్తున్న సేవను కొనియాడారు. కాగా.. ఇందుకు సం

Kuwaitలోని భారతీయులపై ప్రశంసల వర్షం!

ఎన్నారై డెస్క్: కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి ఆ దేశంలోని ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతీయులను హీరోలుగా అభివర్ణించారు. ఎన్నారైలు చేస్తున్న సేవను కొనియాడారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం (World Blood Donor Day ) సందర్భంగా కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్‌తో కలిసి రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సిబి జార్జ్ మాట్లాడారు. కువైత్‌లో ఉన్న రక్తదాతల్లో అత్యధికులు భారతీయ పౌరులే ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న భారతీయులను ఆయన హీరోలుగా అభివర్ణించారు. అంతేకాకుండా భారతీయుల సేవను కువైత్ అధికారులు కూడా గుర్తించి, ప్రశంసించినట్టు చెప్పారు. రక్తదానం గురించి భారతీయుల్లో అవగాహన పెంచి, ప్రోత్సహిస్తున్న ఇండియన్ కమ్యూనిటీలను కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు. 




Updated Date - 2022-06-15T16:05:37+05:30 IST