ఖాళీ విమానాలను పంపి భారతీయులను తీసుకొస్తున్నాం: విదేశాంగశాఖ

ABN , First Publish Date - 2021-03-04T18:42:04+05:30 IST

కరోనా కేసులు పెరగడంతో సౌదీ ప్రభుత్వం 20 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. ఈ ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాల నుంచి

ఖాళీ విమానాలను పంపి భారతీయులను తీసుకొస్తున్నాం: విదేశాంగశాఖ

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరగడంతో సౌదీ ప్రభుత్వం 20 దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. ఈ ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాల నుంచి సౌదీకి వెళ్లేందుకు అనుమతి లేదు. అయితే భారత్‌పై సౌదీ ఆంక్షలు విధించినప్పటికి, సౌదీలో చిక్కుకున్న భారతీయులను మాత్రం కేంద్రం తీసుకొస్తున్నట్టు విదేశాంగశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ బుధవారం వెల్లడించారు. 


ఆంక్షల కారణంగా విదేశాంగశాఖ భారత్ నుంచి సౌదీకి ఖాళీ విమానాలను నడుపుతున్నట్టు, సౌదీలో చిక్కుకున్న భారతీయులు ఈ విమానాల ద్వారా తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మాత్రమే ఇండియన్ ఎయిర్‌లైన్స్ భారత్ నుంచి సౌదీకి ప్రయాణీకులను తీసుకెళ్లగలదని ఈ సందర్భంగా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్ 27 దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకుందని, ఈ దేశాలకు రాకపోకలు జరుగుతున్నట్టు హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. 

Updated Date - 2021-03-04T18:42:04+05:30 IST