భారత్‌కు చేరుకున్న రఫేల్ ఫైటర్ జెట్స్!

ABN , First Publish Date - 2021-07-22T02:45:23+05:30 IST

మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి. ఫ్రాన్స్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ ఫైటర్ జెట్స్ ఎక్కడా ఆగకుండా నేరుగా భారత్‌కు చేరుకున్నాయని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది.

భారత్‌కు చేరుకున్న రఫేల్ ఫైటర్ జెట్స్!

న్యూఢిల్లీ: మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి.  ఫ్రాన్స్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ ఫైటర్ జెట్స్ ఎక్కడా ఆగకుండా నేరుగా భారత్‌కు చేరుకున్నాయని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. మార్గమధ్యంలో ఓ మారు ఇంధనం నింపాల్సి వచ్చిందని(రీఫ్యూలింగ్), యూఏఈ వాయుసేన సహకారంతో విమానం గాల్లో ఉండగానే రీఫ్యూలింగ్ జరిగిందని తెలిపింది. మొత్తం 36 రఫేల్ ఫైటర్స్ కోసం భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఫైటర్ జెట్లతో రెండు స్క్వాడ్రన్‌లు ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. 18 విమానాలున్న తొలి స్క్వాడ్రన్‌‌ను హరియాణాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో ఏర్పాటు చేశారు. పాక్‌ దళాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఉనికిలోకి వచ్చిన ఈ స్క్వాడ్రన్‌ ఇప్పటికే కార్యరంగంలోకి దిగింది. రెండో స్క్వాడ్రన్‌ ఈ నెలాఖరులో పశ్చిమబెంగాల్‌లోని హషిమారా ఎయిర్ బేస్‌లో ఏర్పాటవుతుందని విశ్వసనీయ వర్గాల సమచారం.  

Updated Date - 2021-07-22T02:45:23+05:30 IST