IARIలో 462 అసిస్టెంట్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-05-28T17:03:55+05:30 IST

న్యూఢిల్లీలోని ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేయడానికి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

IARIలో 462 అసిస్టెంట్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని ఐకార్‌-ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(Indian Agricultural Research Institute)(ఐఏఆర్‌ఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేయడానికి  కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పని ప్రదేశాలు- ఖాళీలు: ఐకార్‌ హెడ్‌ క్వార్టర్స్‌-71, ఐకార్‌ సంస్థలు-391

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత

వయసు: 2022 జూన్‌ 01 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: ఐకార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే అభ్యర్థులకు నెలకు రూ.44,900+అలవెన్సులు, వివిధ ఐకార్‌ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులకు నెలకు రూ.35,400+అలవెన్సులు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 07

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 01

వెబ్‌సైట్‌: www.iari.res.in/

Updated Date - 2022-05-28T17:03:55+05:30 IST