దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు

ABN , First Publish Date - 2020-11-29T16:29:54+05:30 IST

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ వేదికగా రెండో వన్డే కొనసాగుతోంది. టాస్‌ గెలిచిన ఆస్ర్టేలియా జట్టు సారథి బ్యాటింగ్ తీసుకున్నాడు

దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు

సిడ్నీ: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా రెండో వన్డే కొనసాగుతోంది. టాస్‌ గెలిచిన ఆస్ర్టేలియా జట్టు సారథి బ్యాటింగ్ తీసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‎లో ఇప్పటికే తొలి మ్యాచ్‎లో ఆసీస్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. రెండో వన్డేనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆసీస్ టీమ్ భావిస్తోంది. రెండవ వన్డే‎లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ జట్టు రంగంలోకి దిగింది.


ఫస్ట్ వన్డే మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించిన ఆసీస్ బ్యాట్స్‎మెన్స్ రెండవ వన్డేలో లోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు ఒక్క వికెట్‌ నష్టపోకుండా 110 పరుగుల చేసింది. ఓపెనర్లు వార్నర్ 64 బంతుల్లో 70 పరుగులు చేయగా..  ఫించ్‌ 58  బంతుల్లో 44 పరుగులు సాధించి క్రీజులో ఉన్నారు.  అయితే.. ఈ మ్యాచ్ లో జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది.


భారత జట్టు: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బూమ్రా


ఆసీస్ జట్టు: అరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్మిత్, లబుషేన్, మ్యాక్సెవెల్, హెన్రిక్స్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జంప, హాజెల్‌వుడ్

Updated Date - 2020-11-29T16:29:54+05:30 IST