శిఖా పాండేపై వేటు

ABN , First Publish Date - 2021-02-28T09:32:20+05:30 IST

సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీ్‌సలలో తలపడే భారత మహిళల జట్ల నుంచి వెటరన్‌ పేసర్‌ శిఖాపాండేకు ఉద్వాసన పలికారు. కాగా, నీతూ డేవిడ్‌ సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీ..

శిఖా పాండేపై వేటు

  • సఫారీలతో సిరీస్‌కు భారత మహిళా జట్ల ఎంపిక 


న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీ్‌సలలో తలపడే భారత మహిళల జట్ల నుంచి వెటరన్‌ పేసర్‌ శిఖాపాండేకు ఉద్వాసన పలికారు. కాగా, నీతూ డేవిడ్‌ సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీ..  టీనేజ్‌ బ్యాటింగ్‌ సంచలనం షఫాలీవర్మకు వన్డేలలో చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. షఫాలీని వన్డే జట్టుకు ఎంపిక చేయకపోవడంపట్ల బీసీసీఐ అధికారి ఒకరు ఆశ్చర్యం ప్రకటించారు. ‘హర్మన్‌ ప్రీత్‌, మంధాన తర్వాత ధాటిగా ఆడగల ఏకైక బ్యాటర్‌ షఫాలి. ఆమె జట్టులో లేకపోవడమంటే బిగ్‌ హిట్టర్‌ను కోల్పోయినట్టే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫామ్‌లోలేని బ్యాటర్‌ వేదా కృష్ణమూర్తిని కూడా రెండు జట్ల నుంచి తొలగించారు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి టీ20 జట్టులో చోటు నిలబెట్టుకుంది. వచ్చేనెల 7న దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఐదు వన్డేలు, మూడు టీ20లలో భారత్‌తో సఫారీ జట్టు తలపడనుంది. మ్యాచ్‌లన్నీ లఖ్‌నవ్‌లో జరగనున్నాయి. ఇక.. వన్డేలకు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, టీ20 జట్టుకు హర్మన్‌ప్రీత్‌ సారథులుగా వ్యవహరించనున్నారు. 


Updated Date - 2021-02-28T09:32:20+05:30 IST