మాస్కోలో తాలిబన్లతో చర్చలకు భారత్

ABN , First Publish Date - 2021-10-15T01:17:22+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లతో

మాస్కోలో తాలిబన్లతో చర్చలకు భారత్

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లతో చర్చలకు భారత దేశం హాజరవుతుంది. ఈ నెల 20న మాస్కోలో జరిగే ఈ చర్చలకు రష్యా ఆతిథ్యమిస్తుండగా, చైనా, పాకిస్థాన్, ఇరాన్ కూడా హాజరవుతాయి. మాస్కో ఫార్మేట్ చర్చలుగా పిలుస్తున్న ఈ సమావేశానికి తాము హాజరవుతామని తాలిబన్లు ప్రకటించినట్లు రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆ దేశ వార్తా సంస్థ తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లతో అక్టోబరు 20న జరిగే మాస్కో ఫార్మేట్ చర్చలకు హాజరవుతున్నట్లు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ధ్రువీకరించింది. భారత్-తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం మధ్య అధికారికంగా జరిగే తొలి చర్చలు ఇవే అవుతాయి. ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లతో భారత్ దోహాలో ఆగస్టు 31న తొలిసారి మాట్లాడింది. 


Updated Date - 2021-10-15T01:17:22+05:30 IST