ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేతపై కేంద్రం కొత్త ఆలోచన..?

ABN , First Publish Date - 2020-04-02T22:25:42+05:30 IST

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న కేంద్రం లాక్‌డౌన్ ఎత్తివేత విషయంలో...

ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేతపై కేంద్రం కొత్త ఆలోచన..?

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న కేంద్రం లాక్‌డౌన్ ఎత్తివేత విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఏప్రిల్ 14తో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ఒకేసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేత శ్రేయస్కరం కాదని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. సీఎంలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.


మెజార్టీ ముఖ్యమంత్రులు కూడా దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేతే సరైన నిర్ణయంగా అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఏప్రిల్ 14న లాక్‌డౌన్ గడువు ముగిసే రోజు ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో వెల్లడించనున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ కట్టడికి ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. ఈ కొద్ది వారాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారంటైన్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు.

Updated Date - 2020-04-02T22:25:42+05:30 IST