దేశంలో భారీగా పెరిగిన గ్యాస్ ధరలు

ABN , First Publish Date - 2021-11-01T21:48:08+05:30 IST

న్యూఢిల్లీ: దేశంలో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.

దేశంలో భారీగా పెరిగిన గ్యాస్ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వాణిజ్యపరంగా వినియోగించే సిలిండర్‌పై రూ. 266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. సవరించిన ధరలు సోమవారం నుంచే అమలులోకి రానున్నాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ. 2వేలు దాటింది. ఇది వరకు ఈ ధర రూ. 1734గా ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ. 2050కు పెరిగింది.


గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల ధర యధాతథంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులుంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. ఎల్పీజీ ధరలు క్రమంగా పెంచుతూ వాటిపై సబ్సిడీని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తొలగించింది.


ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలు సవరిస్తూ ఉంటాయి. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఒడిస్సాలో ఆందోళనలు మిన్నంటాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేడీ వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించింది.

Updated Date - 2021-11-01T21:48:08+05:30 IST