IND vs SA: సూర్యకుమార్ యాదవ్ ఊచకోత.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్

ABN , First Publish Date - 2022-10-03T02:35:03+05:30 IST

గౌహతి వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి...

IND vs SA: సూర్యకుమార్ యాదవ్ ఊచకోత.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్

గౌహతి వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. 238 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు నిర్దేశించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ శుభారంభాన్ని అందించారు. 96 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. 96 పరుగుల వద్ద టీమిండియా రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. పదో ఓవర్‌లో ఐదో బంతికి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన రోహిత్ శర్మ స్టబ్స్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కోహ్లీ 28 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.



కేఎల్ రాహుల్ 57 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ మహరాజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్స్‌లు, ఫోర్లతో సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగి ఆడాడు. 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడంటే సూర్యకుమార్ ఏ రేంజ్‌లో విజృంభించి బ్యాటింగ్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. సూర్యకుమార్ ఈ హాఫ్ సెంచరీతో మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 573 బంతుల్లో.. 174 స్ట్రైక్ రేట్‌తో 1000 పరుగుల క్లబ్‌లో చేరిన బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.

Updated Date - 2022-10-03T02:35:03+05:30 IST