టెస్టులే సుప్రీమ్‌

ABN , First Publish Date - 2020-02-20T09:58:01+05:30 IST

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పనకు కెప్టెన్‌ కోహ్లీ అత్యున్నత రేటింగ్‌ ఇచ్చాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ తదితర టోర్నీలను ఐసీసీ నిర్వహిస్తున్నా.. జెంటిల్మన్‌ క్రీడకు

టెస్టులే సుప్రీమ్‌

న్యూజిలాండ్‌లో భారత పర్యటన చివరి అంకానికి మరో రోజులో తెరలేవనుంది.. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సను భారత్‌ క్లీన్‌స్వీ్‌ప చేయగా అనంతరం పుంజుకొన్న ఆతిథ్య జట్టు మూడు వన్డేల సిరీ్‌సను 3-0తో సొంతం చేసుకుంది.. అంటే ఇరు జట్లు చెరో సిరీ్‌సలో ఆధిపత్యం ప్రదర్శించాయి.. ఇక రెండు టెస్టుల సిరీ్‌సలో మొదటి మ్యాచ్‌ శుక్రవారం వెల్లింగ్టన్‌లో ప్రారంభం కానుంది.. ఇప్పటివరకు ఆడింది ఒక ఎత్తయితే రాబోయే రెండు మ్యాచ్‌ల్లో రాణించడం మరో ఎత్తు.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన భారత్‌ 360 పాయింట్లతో టాప్‌లో ఉంది.. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీలలో టెస్టు చాంపియన్‌షిప్‌ అత్యున్నతమని కెప్టెన్‌ కోహ్లీ అనడం చూస్తే ఈ సిరీ్‌సలో భారత జట్టు మరింత దూకుడు కనబర్చడం ఖాయం..


మిగతా అన్ని టోర్నీలు 

దాని తర్వాతే: కెప్టెన్‌ కోహ్లీ

భారత్‌ వర్సెస్ కివీస్‌ తొలి టెస్టు

వెల్లింగ్టన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పనకు కెప్టెన్‌ కోహ్లీ అత్యున్నత రేటింగ్‌ ఇచ్చాడు. వన్డే, టీ20 వరల్డ్‌కప్‌ తదితర టోర్నీలను ఐసీసీ నిర్వహిస్తున్నా.. జెంటిల్మన్‌ క్రీడకు అసలు సిసలు రూపమైన టెస్టు మ్యాచ్‌లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఐసీసీ ప్రవేశపెట్టిన ‘చాంపియన్‌షి్‌ప’ అత్యున్నతమని తెలిపాడు. పరిమిత ఓవర్లలో రెండు కొత్త టోర్నీల ను తీసుకురావాలని ఐసీసీ ఆలోచిస్తున్న తరుణంలో కోహ్లీ వ్యా ఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టెస్టు చాంపియన్‌షి్‌ప కొనసాగాలి. మిగతా ఐసీసీ టోర్నమెంట్లన్నీ దీని తర్వాతే. అన్ని జట్లు కూడా లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో ఆడాలని పట్టుదలగా ఉన్నాయి. అందువల్ల టెస్టు చాంపియన్‌షి్‌ప ఐసీసీ టోర్నీలన్నింటికంటే సుప్రీం. సాధ్యమైనంత త్వరగా మేం ఫైనల్‌కు క్వాలిఫై కావడమే కాదు టెస్ట్‌ చాంపియన్‌షి్‌పను సొంతం చేసుకోవాలనుకుంటున్నాం’ అని బుధవారం చెప్పాడు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ సిరీస్‌ హోరాహోరీగా సాగడంతో.. భారత్‌-న్యూజిలాండ్‌ రెండు టెస్టులు సైతం అదే స్థాయిలో కొనసాగే అవకాశాలున్నాయని విరాట్‌ అభిప్రాయపడ్డాడు. 


కొత్తగా చాంపియన్స్‌ కప్‌లు

వన్డే, టీ20 టోర్నీలలో చాంపియన్స్‌ కప్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తోంది. 2023-2031 సైకిల్‌లో ఈ టోర్నీలు నిర్వహించాలని ఆలోచిస్తోంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ తరహాలోనే టీ20 చాంపియన్స్‌ కప్‌ నిర్వహించాలనుకుంటోంది. అంటే.. 10 జట్లు 48 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఇక వన్డే చాంపియన్స్‌ కప్‌లో టాప్‌-6 జట్లు 16 మ్యాచ్‌ల్లో ఢీకొంటాయి. 2024, 2028లలో టీ20... 2025, 2029లలో వన్డే చాంపియన్స్‌ కప్‌లను జరపాలని ఐసీసీ ప్రణాళికలు రచిస్తోంది.


తుది జట్టులో ఇషాంత్‌, పృథ్వీ!

మొదటి టెస్టు తుది జట్టులో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌, ఓపెనర్‌ పృథ్వీ షా ఉంటారని కోహ్లీ సూచనప్రాయంగా వెల్లడించాడు. అలాగే భారత జట్టు బుధవారం నాటి సాధన తీరును పరిశీలిస్తే వికెట్‌ కీపర్‌గా  వృద్ధిమాన్‌ సాహా వైపే జట్టు యాజమాన్యం మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఇషాంత్‌, బుమ్రా, షమి ముగ్గురు స్పెషలిస్ట్‌ పేసర్లుగా, అశ్విన్‌ స్పిన్నర్‌గా బరిలోకి దిగడం దాదాపు ఖాయమే. విదేశాల్లో ఆరో నెంబర్‌లో తెలుగు ఆటగాడు హనుమ విహారికి  ప్రాము ఖ్యం ఇస్తోంది. దాంతో ఐదో బౌలర్‌ బాధ్యతలను అతడు పంచుకోనున్నాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ ఖాయమే అయినా.. ఆల్‌రౌండ్‌ నైపుణ్యం రీత్యా రవీంద్ర జడేజాను విస్మరించలేని పరిస్థితి. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాదానికి గాయమై మూడు వారాలు ఆటకు దూరంగా ఉన్న ఇషాంత్‌ సాధనలో పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేయడమేకాదు..పేస్‌, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ‘పాదం గాయానికి ముందు ఎలా బౌలింగ్‌ చేశాడో ఇప్పుడూ ఇషాంత్‌ అలాగే బంతులు వేస్తున్నాడు. సరైన బంతులు సంధిస్తున్నాడు. గతంలో అతడు ఇక్కడ టెస్ట్‌ క్రికెట్‌ ఆడాడు. ఆ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగం’ అని విరాట్‌ అన్నాడు. న్యూజిలాండ్‌ మొత్తం పేస్‌ బౌలర్లతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. భారత్‌ మాత్రం ఒక స్పిన్నర్‌, నలుగురు పేసర్ల సంప్రదాయాన్ని కొనసాగించనుంది. 


మూడేళ్లు భారం భరించాల్సిందే..

మూడు ఫార్మాట్లలో ఆడడం భారమేనని, అయినా మరో మూడేళ్లపాటు దానిని భరించాల్సిందేనని విరాట్‌ తెలిపాడు. ఆ కాలంలో రెండు టీ20, ఓ వన్డే ప్రపంచక్‌పలు జరగనున్నాయి. ‘నేను విస్తృత స్థాయిలో ఆలోచిస్తున్నా. ఇప్పటి నుంచి మూడేళ్లపాటు నేను తీవ్రంగా శ్రమించాల్సిందే. ఆ తర్వాతే మన చర్చ విభిన్నంగా ఉంటుంది’ అని అన్నాడు. అంటే మూడు వరల్డ్‌క్‌పల తర్వాతే మూడు ఫార్మాట్లలో రెండింటిలోనే ఆడే విషయమై కోహ్లీ నిర్ణయం తీసుకోనున్నాడన్నమాట. 

Updated Date - 2020-02-20T09:58:01+05:30 IST