ఇంగ్లండ్ ఆధిక్యాన్ని చేరుకున్న భారత్.. అసలు కథ ఇప్పుడే మొదలు

ABN , First Publish Date - 2021-09-04T23:15:13+05:30 IST

కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది

ఇంగ్లండ్ ఆధిక్యాన్ని చేరుకున్న భారత్.. అసలు కథ ఇప్పుడే మొదలు

లండన్: కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 43/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 83 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోరుగా ఆడిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను జేమ్స్ అండర్సన్ పెవిలియన్ పంపాడు. 101 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 6 ఫోర్లు, సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. 


మరోవైపు, క్రీజులో కుదురుకున్న మరో ఓపెనర్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడుతూ స్కోరు  పెంచుతూ పోతున్నాడు. రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా వరుస ఫోర్లతో ఊపు మీదున్నాడు. లంచ్ బ్రేక్ సయానికి టీమిండియా వికెట్ నష్టానికి 108 పరుగులు చేసి ఇంగ్లండ్ కంటే 9 పరుగుల ఆధిక్యంలో ఉంది.


భారత్‌కు అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు చేసిన పరుగులు ఇంగ్లండ్ ఆధిక్యాన్ని సమం చేసేందుకే సరిపోగా, ఇక నుంచి చేసే పరుగులు మాత్రమే లెక్కలోకి రానున్నాయి. దీంతో భారత బ్యాట్స్‌మన్ ఆచితూడి ఆడాల్సి ఉంటుంది. మూడో టెస్టులా ఏమాత్రం తడబడినా ఇంగ్లండ్ విజయాన్ని ఆపడం కష్టసాధ్యం అవుతుంది. రోహిత్ శర్మ 47, పుజారా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-09-04T23:15:13+05:30 IST