అఫ్ఘాన్‌ సంక్షోభాన్ని నివారించడంలో భారత్‌ది కీలక పాత్ర: బ్రిటన్

ABN , First Publish Date - 2021-08-18T00:22:33+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ సంక్షోభాన్ని సద్దుమణిగేలా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని బ్రిటన్ తాజాగా అభిప్రాయపడింది.

అఫ్ఘాన్‌ సంక్షోభాన్ని నివారించడంలో భారత్‌ది కీలక పాత్ర: బ్రిటన్

లండన్: అఫ్ఘానిస్థాన్‌ సంక్షోభాన్ని సద్దుమణిగేలా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని బ్రిటన్ తాజాగా అభిప్రాయపడింది. అఫ్ఘానిస్థాన్‌కు సంబంధించి భారత్ పాత్రపై.. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డామినిక్ రాబ్ మంగళవారం నాడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సమస్య పరిష్కారానికి బ్రిటన్‌.. తన భావజాలానికి దగ్గరగా ఉన్న దేశాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. అఫ్ఘాన్‌లో ప్రాబల్యం కలిగిన రష్యా, చైనా వంటి దేశాలనూ కలుపుకుని వెళ్లాలి. ఇది కొంత కష్టమే. ఇక బ్రిటన్‌కు కీలక భాగస్వామి అయిన భారత్‌‌తోనూ సంప్రదింపులు జరపాలి. ఈ విషయంలో భారత్ చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-18T00:22:33+05:30 IST