‘వందేభారత్’ మూడో దశలో స్వదేశానికి 38 వేల మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-06-05T03:24:43+05:30 IST

వందేభారత్ మిషన్ మూడో దశలో భాగంగా దాదాపు 38 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించనున్నారు.

‘వందేభారత్’ మూడో దశలో స్వదేశానికి 38 వేల మంది భారతీయులు

న్యూఢిల్లీ: వందేభారత్ మిషన్ మూడో దశలో భాగంగా దాదాపు 38 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించనున్నారు. 31 దేశాల్లో చిక్కుకుపోయిన వీరిని తరలించేందుకు 337 విమానాలు రెడీ అయ్యాయి. వీటిలో 54 అమెరికా, 24 కెనడా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, కెన్యా, సీషెల్స్, మారిషస్ నుంచి 11 విమానాలు రానున్నాయి. వందేభారత్ మిషన్ మొదటి రెండు విడతల్లో 1,07,123 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. మే 17న ప్రారంభమైన రెండో విడతలో భాగంగా ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు 103 విమానాలు నడిపింది. జూన్ 13 వరకు ఇది కొనసాగనున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా, తొలి రెండు విడతల్లో భారత్ చేరుకున్న 1,07,123 మందిలో 17,485 మంది వలస కార్మికులు, 11,511 మంది విద్యార్థులు, 8,633 నిపుణులు ఉన్నారు. సరిహద్దు ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల ద్వారా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి 32 వేల మందికిపైగా భారత్ చేరుకున్నారు. 

Updated Date - 2020-06-05T03:24:43+05:30 IST