దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్‌..?

ABN , First Publish Date - 2020-05-22T10:16:34+05:30 IST

కరోనా అదుపులోకి వస్తే ఆగస్టు చివర్లో భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించే అవకాశముంది. గత ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీ్‌సలో భాగంగా సౌతాఫ్రికాతో టీమిండియా 3 టీ20ల సిరీస్‌ ఆడనుంది. అయితే, ఇరు దేశ

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్‌..?

న్యూఢిల్లీ: కరోనా అదుపులోకి వస్తే ఆగస్టు చివర్లో భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించే అవకాశముంది. గత ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీ్‌సలో భాగంగా సౌతాఫ్రికాతో టీమిండియా 3 టీ20ల సిరీస్‌ ఆడనుంది. అయితే, ఇరు దేశ ప్రభుత్వాల అనుమతి కూడా ఈ సిరీ్‌సకు కీలకంగా మారింది. భవిష్యత్‌ ప్రణాళికల జాబితాలో లేకపోయినా.. పొట్టి సిరీ్‌సకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడం ఎంతో సంతోషంగా ఉందని క్రికెట్‌ సౌతాఫ్రికా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాక్వెస్‌ ఫౌల్‌ చెప్పాడు. కాగా, భారత బోర్డు సౌతాఫ్రికా టూర్‌కు అంగీకరించడం వెనుక మరో కారణం ఉందని భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ బదులు ఐపీఎల్‌ నిర్వహించడానికి సౌతాఫ్రికా మద్దతు లభిస్తుందని అనుకుంటున్నారు. ఒకవేళ భారత్‌ పర్యటన ఖరారైతే జూలైలో వెస్టిండీస్‌ టూర్‌ను రీషెడ్యూల్‌ చేయడానికి కొత్త తేదీలను పరిశీలిస్తామని సీఎస్‌ఏ డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ చెప్పాడు.

Updated Date - 2020-05-22T10:16:34+05:30 IST