16న సౌతాఫ్రికాకు టీమిండియా.. 44 రోజులు బయోబబుల్‌లోనే!

ABN , First Publish Date - 2021-12-11T02:19:38+05:30 IST

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు ఈ నెల 16న

16న సౌతాఫ్రికాకు టీమిండియా.. 44 రోజులు బయోబబుల్‌లోనే!

న్యూఢిల్లీ:  దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమవుతున్న భారత జట్టు ఈ నెల 16న సౌతాఫ్రికా ప్లైట్ ఎక్కనుంది. అంతకంటే ముందు ఈ నెల 12న ఆటగాళ్లు ముంబై చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజులు క్వారంటైన్‌లో గడుపుతారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్తారు.


వచ్చే నెల 15తో టెస్టు సిరీస్‌ ముగుస్తుంది. అప్పటి వరకు టెస్టు జట్టు ఆటగాళ్లు బయోబబుల్‌లో గడుపుతారు. వన్డే జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు మరో 8 రోజులు అదనంగా క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా 44 రోజులు ఆంక్షల మధ్య గడుపుతారు.


సెంచూరియన్‌లో బాక్సింగ్ డే టెస్టుతో మొదలు కానున్న మూడు టెస్టుల కోసం బీసీసీఐ ఇటీవల 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మరో రెండు రోజుల్లో వన్డే జట్టును కూడా ప్రకటిస్తుంది. 

Updated Date - 2021-12-11T02:19:38+05:30 IST