వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకోనున్న భారత్‌

ABN , First Publish Date - 2020-04-09T06:16:36+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడిచమురు ధర 31 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది భారత్‌కు గొప్ప అవకాశం. ఈ నేపథ్యంలో భూగర్భంలోని వ్యూహాత్మక చమురు నిల్వలను...

వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచుకోనున్న భారత్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడిచమురు ధర 31 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది భారత్‌కు గొప్ప అవకాశం. ఈ నేపథ్యంలో భూగర్భంలోని వ్యూహాత్మక చమురు నిల్వలను పెం చుకోవాలని మన దేశం భావిస్తోంది. ఇందుకోసం సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్‌ వంటి దేశాల నుంచి ముడి చమురును మరింతగా దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. దీనివల్ల భవిష్యత్‌లో సరఫరా లేదా ధరలకు సంబంధించిన ఇబ్బందులను అధిగమించే అవకాశం ఏర్పడనుంది. భారత్‌ అత్యవసరాల కోసం 53.3 లక్ష ల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నిల్వలు 9.5 రోజులకు సరిపోతాయి. కర్ణాటకలోని మంగళూరు, పదూర్‌తోపా టు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో భూగర్భ నిల్వ కేంద్రాలున్నాయి. 

Updated Date - 2020-04-09T06:16:36+05:30 IST