జైత్రయాత్ర సాగేనా?

ABN , First Publish Date - 2022-07-29T10:01:28+05:30 IST

మూడు వన్డేల సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు ధనాధన్‌ ఆటతీరుతో అదరగొట్టేందుకు సిద్ధమైంది.

జైత్రయాత్ర సాగేనా?

రోహిత్‌ ఆధ్వర్యంలో బరిలోకి భారత్‌

స్టార్ల రాకతో మరింత జోష్‌

విండీస్‌తో తొలి టీ20 నేడు 

రాత్రి 8 నుంచి 

డీడీ స్పోర్ట్స్‌లో..


టరౌబా (పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌): మూడు వన్డేల సిరీ్‌సను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు ధనాధన్‌ ఆటతీరుతో అదరగొట్టేందుకు సిద్ధమైంది. అయితే యువ ఆటగాళ్లతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టు చేతిలోనే 0-3తో వైట్‌వాష్‌ అయిన విండీస్‌.. ఇప్పుడు స్టార్‌ క్రికెటర్లతో కూడిన పూర్తి స్థాయి జట్టును టీ20 ఫార్మాట్‌లో ఎలా ఎదుర్కోనుందో చూడాల్సిందే. వన్డే సిరీ్‌సకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌, పంత్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, భువనేశ్వర్‌ రాకతో జట్టు మరింత పటిష్టంగా తయారైంది. ఇక వరల్డ్‌క్‌పనకు మూడు నెలల సమయం కూడా లేకపోగా, భారత్‌ గరిష్టంగా 16 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులోనే తమ వరల్డ్‌కప్‌ సైన్యాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్‌ జట్టులో బెర్త్‌ ఆశించే ఆటగాళ్లకు కీలకం కానుంది. 


ఓపెనర్‌ ఎవరో..?:

కేఎల్‌ రాహుల్‌ కరోనాతో దూరమవ్వడంతో రోహిత్‌కు జతగా ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు పంత్‌ను కొనసాగిస్తారా? లేక ఇషాన్‌ను ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. మూడో నెంబర్‌లో శ్రేయా్‌సకన్నా దీపక్‌ హుడాకే చాన్స్‌ ఉంది. సూర్యకుమార్‌ ఆ తర్వాత ఆడతాడు. ఇషాన్‌ ఓపెనర్‌గా వస్తే ఐదో నెంబర్‌లో పంత్‌ ఖాయం. అనంతరం హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌ల రూపంలో హిట్టర్స్‌ సిద్ధంగా ఉంటారు. అయితే జడేజా ఫిట్‌గా ఉంటే డీకే బెంచీకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు పేసర్లతో వెళితే అతడిని భర్తీ చేయవచ్చు. మరోవైపు స్పిన్నర్‌ చాహల్‌కు విశ్రాంతినివ్వగా.. జడేజా, అశ్విన్‌, అక్షర్‌, కుల్దీప్‌, రవి బిష్ణోయ్‌ చోటు కోసం ఆసక్తిగా ఉన్నారు. జడ్డూ ఫిట్‌గా లేకపోతే అశ్విన్‌, అక్షర్‌, కుల్దీ్‌పను ఆడించొచ్చు. పేస్‌ విభాగంలో భువనేశ్వర్‌, హర్షల్‌ తుది జట్టులో ఉంటారు. మూడో పేసర్‌ అవసరమనుకుంటే అర్ష్‌దీప్‌ను బరిలోకి దింపొచ్చు.


పోటీకి సిద్ధం:

మూడు వన్డేల సిరీ్‌సలో చిత్తయిన విండీస్‌ పొట్టి ఫార్మాట్‌లో సత్తా చూపాలనుకుంటోంది. టీ20 స్పెషలి్‌స్టలతో పాటు హార్డ్‌ హిట్టర్లతో కూడిన ఈ జట్టు ఇటీవలే బంగ్లాదేశ్‌పై 2-0తో సిరీస్‌ గెలిచింది. ఇప్పుడు అదే జట్టుతో బరిలోకి దిగి భారత్‌పైనా బదులు తీర్చుకోవాలనుకుంటోంది. కెప్టెన్‌ పూరన్‌, కింగ్‌, మేయర్స్‌, పావెల్‌ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే విషయం. ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ భారీ షాట్లు కూడా ఆడగలడు. దీంతో సుదీర్ఘంగా ఈ సిరీ్‌సలో పట్టు సాధించి పరువు కాపాడుకునే ఆలోచనలో విండీస్‌ ఉంది.

జట్లు (అంచనా)

భారత్‌:

రోహిత్‌, ఇషాన్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌/జడేజా, అశ్విన్‌/అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, కుల్దీప్‌.


వెస్టిండీస్‌:

హోప్‌, మేయర్స్‌, బ్రూక్స్‌, కింగ్‌, పూరన్‌ (కెప్టెన్‌), పావెల్‌, కార్టీ, హోల్డర్‌, హోసెన్‌, మోతీ, జోసెఫ్‌.

Updated Date - 2022-07-29T10:01:28+05:30 IST