మస్కట్ : ఆసియా కప్ హాకీ 2022 మెన్స్‌లో(Asia Cup Hockey 2022 ) అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 16-0 తేడాతో ఇండోనేషియాను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. అద్భుతమైన ఈ గెలుపుతో సూపర్ 4 రౌండ్‌కు భారత్ అర్హత సాధించింది. భారత్ కంటే ముందు జపాన్, మలేసియా, దక్షిణకొరియా సూపర్ 4 రౌండ్‌లోకి అడుగుపెట్టాయి. పాకిస్తాన్‌ను అధిగమించి రౌండ్ 4లోకి చేరాలంటే భారత్ 15 గోల్స్ చేయాల్సివుండగా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఏకంగా 16 గోల్స్ నమోదు చేసి తిరుగులేని విజయం సాధించారు. పూల్ ఏలో పాకిస్తాన్, ఇండియా చెరో నాలుగు పాయింట్లను కలిగివున్నాయి. దీంతో మెరుగైన గోల్స్ కలిగివున్న జట్టే తదుపరి రౌండ్‌కు చేరుతుందనే నిబంధన ప్రకారం భారత్ రౌండ్4లోకి చేరింది.