హార్దిక్‌ ఆగయా..

ABN , First Publish Date - 2020-03-09T09:58:54+05:30 IST

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీ్‌సకు భారత జట్టును ఆదివారం ప్రకటించారు. శస్త్రచికిత్స నుంచి కోలుకుని బ్యాట్‌తో అదరగొడుతున్న ఆల్‌రౌండర్‌

హార్దిక్‌ ఆగయా..

సౌతాఫ్రికాతో సిరీస్ కు పాండ్యా 

ధవన్‌, భువీ కూడా పునరాగమనం

జాదవ్‌, శార్దూల్‌, దూబేపై వేటు


అహ్మదాబాద్‌: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీ్‌సకు భారత జట్టును ఆదివారం ప్రకటించారు.  శస్త్రచికిత్స నుంచి కోలుకుని బ్యాట్‌తో అదరగొడుతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. గాయాల నుంచి కోలుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కూడా పునరాగమనం చేశారు. కొత్త చైర్మన్‌ సునీల్‌ జోషి ఆధ్వర్యంలో సమావేశమైన కమిటీ.. వెటరన్‌ కేదార్‌ జాదవ్‌ను పక్కనబెట్టింది. తెల్లబంతుల క్రికెట్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు మళ్లీ అవకాశం కల్పించింది. పిక్క గాయంనుంచి కోలుకోకపోవడంతో వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌తో సిరీ్‌సలో ఆడిన పృథ్వీ షా స్థానం నిలబెట్టుకోగా.. ఆ సిరీ్‌సలో విఫలమైన మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో ధవన్‌కు చోటు లభించింది. అలాగే కివీస్‌ టూర్‌లో ఆకట్టుకోలేకపోయిన ముంబై ద్వయం శార్దూల్‌ ఠాకూర్‌, శివమ్‌ దూబేలపై వేటు పడింది. న్యూజిలాండ్‌తో సిరీ్‌సలో ఆడిన పేసర్‌ షమికి విశ్రాంతినిచ్చారు. మూడు వన్డేలు ధర్మశాల (మార్చి 12), లఖ్‌నవ్‌ (మార్చి 15), కోల్‌కతా (మార్చి 18)లో జరగనున్నాయి. 


జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, భువనేశ్వర్‌, చాహల్‌, బుమ్రా, నవ్‌దీప్‌ సైనీ, కుల్దీప్‌, శుభ్‌మన్‌ గిల్‌. 

Updated Date - 2020-03-09T09:58:54+05:30 IST