సిరీస్‌పై భారత్‌ గురి

ABN , First Publish Date - 2022-08-06T10:09:03+05:30 IST

ఐదు టీ20ల సిరీస్‌ కరీబియన్‌ దీవుల నుంచి ఇప్పుడు అమెరికాకు మారింది.

సిరీస్‌పై భారత్‌ గురి

  నేడు విండీస్‌తో నాలుగో టీ20

శ్రేయాస్‌ ఫామ్‌పై ఆందోళన

  రాత్రి 8 గం. నుంచి డీడీ స్పోర్ట్స్‌లో..


లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): ఐదు టీ20ల సిరీస్‌ కరీబియన్‌ దీవుల నుంచి ఇప్పుడు అమెరికాకు మారింది. చివరి రెండు టీ20లు ఫ్లోరిడాలో జరుగనున్నాయి. ఈనేపథ్యంలో నేడు జరిగే నాలుగో టీ20లో భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. తద్వారా 2-1తో ఆధిక్యంలో ఉన్న జట్టు మరో మ్యాచ్‌ ఉండగానే సిరీ్‌సను ఖాతాలో వేసుకోవచ్చు. రెండో మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని మూడో మ్యాచ్‌లో ఆతిథ్య విండీ్‌సను భారత్‌ వణికించింది. అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ ఫామ్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 34 రన్స్‌ మాత్రమే చేసిన తను రానున్న ఆసియాకప్‌, టీ20 ప్రపంచక్‌పలో చోటు దక్కించుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో సత్తా నిరూపించుకోవాల్సిందే.


రాహుల్‌, కోహ్లీ జట్టులోకి వస్తే శ్రేయాస్‌ బెర్త్‌ సందేహాత్మకంగా మారుతుంది. అదీగాకుండా అతడికి దీపక్‌ హుడా నుంచి గట్టి పోటీయే నెలకొంది. ఇక మూడో మ్యాచ్‌ రెండో ఓవర్‌లోనే గాయంతో వెనుదిరిగిన కెప్టెన్‌ రోహిత్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బౌలింగ్‌లో పేసర్‌ అవేశ్‌ ధారాళంగా పరుగులు ఇస్తుండడంతో అతడి స్థానంలో మరో స్పిన్నర్‌ కుల్దీ్‌పకు చాన్స్‌ దక్కవచ్చు. హర్షల్‌ ఫిట్‌నె్‌సపై స్పష్టత లేదు. మరోవైపు వెస్టిండీ్‌సకు ఈ మ్యాచ్‌ చావోరేవో కానుంది. సిరీ్‌సపై ఆశలు పెట్టుకోవాలంటే నాలుగో టీ20 కచ్చితంగా నెగ్గి తీరాల్సిందే. అయితే బ్యాటింగ్‌లో కెప్టెన్‌ పూరన్‌, హెట్‌మయెర్‌, పావెల్‌ బ్యాట్లు ఝుళిపించాలి.

Updated Date - 2022-08-06T10:09:03+05:30 IST