Srilanka కంటే India దారుణమవుతుంది: sedition పై Mehbooba

ABN , First Publish Date - 2022-05-11T19:54:51+05:30 IST

మన దేశంలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై రాజద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మన పరిస్థితులు శ్రీలంక కంటే దారుణంగా తయారు అవుతాయి..

Srilanka కంటే India దారుణమవుతుంది: sedition పై Mehbooba

శ్రీనగర్: రాజద్రోహం చట్టం 124A అమలుపై సుప్రీంకోర్టు (Supreme court) స్టే ఇవ్వడాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన Peoples Democratic Party అధినేత Mehbooba Mufti స్వాగతించారు. అంతే కాకుండా ఈ చట్టాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ చట్టంపై సుప్రీం స్టే ఇవ్వగానే ఆమె Srinagar లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ చట్టం ఇంకా కొనసాగితే India లోని పరిస్థితులు Srilanka కంటే దారుణంగా తయారవుతాయని అన్నారు.


‘‘మన దేశంలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై రాజద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మన పరిస్థితులు శ్రీలంక కంటే దారుణంగా తయారు అవుతాయి. దేశంలో మతం ఆధారంగా విధ్వేషాలు రెచ్చగొట్టం, మెజారిటీ వాదాన్ని చూపిస్తూ అల్లర్లను ప్రేరేపించడం లాంటి పరిస్థితుల్ని అదుపు చేయాలి. శ్రీలంకను చూసైనా BJP పాఠాలు నేర్చుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని మెహబూబా అన్నారు.

Read more