థ్యాంక్స్ టు రామ్ మాధవ్: సింగపూర్ తెలుగు ప్రతినిధులు

ABN , First Publish Date - 2020-06-05T20:03:59+05:30 IST

సింగపూర్: కోవిద్-19 కారణంగా 2 నెలలకు పైగా సింగపూర్‌లో చిక్కుకు పోయిన తెలుగు, తమిళనాడు మరియు

థ్యాంక్స్ టు రామ్ మాధవ్: సింగపూర్ తెలుగు ప్రతినిధులు

సింగపూర్: కోవిద్-19 కారణంగా 2 నెలలకు పైగా సింగపూర్‌లో చిక్కుకు పోయిన తెలుగు, తమిళనాడు మరియు కేరళ వారి కష్టాలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దృష్టికి వెళ్లాయి. సింగపూర్‌ తెలుగు ప్రతినిధి రత్నకుమార్ రామ్ మాధవ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన రామ్ మాధవ్ విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌ పూరీతో మాట్లాడారు. అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అదనపు విమానాలను సిద్దం చేశామని రామ్ మాధవ్ సింగపూర్ తెలుగు ప్రతినిధులకు తెలిపారు. 


వాస్తవానికి సింగపూర్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం వందేభారత్ మిషన్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ మరియు బెంగుళూరుకు ప్రత్యేక విమానాలను నడిపింది. ఇందులో భాగంగా ఒక సర్వీస్‌ని మాత్రమే హైదరాబాద్‌కి నడిపింది. చాలా దక్షిణాది పట్టణాలకు ముఖ్యంగా చెన్నై, విజయవాడ, కొచ్చికి ఎలాంటి పౌర విమాన సర్వీస్‌లు లేకపోవడంతో దక్షిణాది వారు ఇబ్బందులు పడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు సింగపూర్‌లోని తెలుగు ప్రతినిధి రత్నకుమార్ యత్నించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను సంప్రదించి సమస్య పరిష్కారంలో చొరవ చూపారు. సత్వరమే స్పందించిన రామ్ మాధవ్‌కు రత్నకుమార్ ధన్యవాదాలు తెలిపారు. 


విమాన సేవలపై ఎలాంటి పుకార్లు నమ్మరాదని, తాజా వివరాలను ఇండియన్ హై కమిషన్ ఆఫ్ సింగపూర్ ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకోవాలని తెలుగు ప్రతినిధులు సూచించారు.  




Updated Date - 2020-06-05T20:03:59+05:30 IST