Abn logo
Jan 24 2021 @ 03:18AM

దేశంలో నాలుగు రాజధానులుండాలి: మమత

భారత దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పార్లమెంటు సమావేశాలను కేవలం ఢిల్లీలోనే కాకుండా రొటేషన్‌ పద్ధతిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని కోరారు. శనివారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని కోల్‌కతాలో మమత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ సర్కారుపై దీదీ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం నేతాజీ జయంతిని పరాక్రమ్‌ దివ్‌సగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. దీనిని దేశ్‌నాయక్‌ దివ్‌సగా ఎందుకు జరపడంలేదని ప్రశ్నించారు. నేతాజీని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.. దేశ్‌నాయక్‌ అని పిలిచేవారన్నారు. నేతాజీ జయంతి రోజైన జనవరి 23ను జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement