జర్మనీకి భారత్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-04-04T09:49:54+05:30 IST

బలమైన జర్మనీకి షాకిచ్చిన భారత మహిళల హాకీ జట్టు.. ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

జర్మనీకి భారత్‌ షాక్‌

జూనియర్‌ మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌కు


పోచె్‌ఫస్ట్రోమ్‌: బలమైన జర్మనీకి షాకిచ్చిన భారత మహిళల హాకీ జట్టు.. ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పూల్‌-డిలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1తో జర్మనీపై సంచలన విజయం సాధించింది. వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గిన మన అమ్మాయిలు..  గ్రూప్‌ టాపర్‌గా నాకౌట్‌ అవకాశాలను దక్కించుకున్నారు. భారత జట్టులో లాల్‌రిమ్సియామి (2వ నిమిషం), ముంతాజ్‌ (25వ) గోల్స్‌ సాధించారు. జర్మనీ తరఫున జూలీ బ్లూయర్‌ (57వ) ఏకైక గోల్‌ చేసింది. ఈనెల 5న ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ ఆడనుంది. 

Updated Date - 2022-04-04T09:49:54+05:30 IST