శ్రీలంకకు చేరిన 5లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్!

ABN , First Publish Date - 2021-02-26T06:56:15+05:30 IST

కరోనా వైరస్ విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అనేక దేశాలకు కొవి

శ్రీలంకకు చేరిన 5లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అనేక దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ను బహుమతిగా ఇస్తోంది. ఈ క్రమంలోనే భారత్.. శ్రీలంకకు కూడా ఇప్పటికే ఐదు లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌‌ను గత నెలలో అందించింది. తాజాగా మరో 5లక్షల డోసులను భారత ప్రభుత్వం శ్రీలంకకు పంపింది. కాగా.. వ్యాక్సిన్ డోసులతో కూడిన పార్శిల్ గురువారం రోజు శ్రీలంకకు చేరింది. ఈ క్రమంలో శ్రీలంక ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. భారత్ పంపిన 5లక్షల డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ శ్రీలంకకు చేరినట్టు ప్రకటించారు. స్టేట్ ఫార్మాసిటికల్స్ కార్పోరేషన్ ఆఫ్ శ్రీలంక, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను పొందినట్టు చెప్పారు. శుక్రవారం నుంచి ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. 5లక్షల డోసుల కోవీషీల్డ్ వ్యాక్సిన్ చేరిన సందర్భంగా శ్రీలంకలోని ఇండియన్ హైకమిషన్ స్పందించింది. ‘మహమ్మారిపై విజయం సాధించడానికి శ్రీలంకకు చరుకుగా సహాయం చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. 


Updated Date - 2021-02-26T06:56:15+05:30 IST