తొలి టెస్టు: లంచ్ విరామానికి భారత్ 109/2

ABN , First Publish Date - 2022-03-04T17:34:30+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‎లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.

తొలి టెస్టు: లంచ్ విరామానికి భారత్ 109/2

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‎లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ జోడీ తొలి వికెట్‌కు అర్ధశతకం(52) భాగస్వామ్యం నెలకొల్పింది. వరుస బౌండరీలతో చెలరేగిన సారథి రోహిత్ అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 29 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ కుమార బౌలింగ్‌లో లక్మల్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి మయాంక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లసిత్‌ ఎంబుల్డెనియాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో భారత జట్టు 80 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. దీంతో లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విహారి(30), కోహ్లీ(15) ఉన్నారు.    

Updated Date - 2022-03-04T17:34:30+05:30 IST