బాల్య వివాహాలపై పోరులో భారత్ భేష్: ఐరాస
ABN , First Publish Date - 2020-09-25T08:12:58+05:30 IST
బాల్య, బలవంతపు వివాహాలు, లింగ వివక్షపై భారత్ చేస్తున్న పోరాటాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది...
ఐక్యరాజ్యసమితి, సెప్టెంబరు 24: బాల్య, బలవంతపు వివాహాలు, లింగ వివక్షపై భారత్ చేస్తున్న పోరాటాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. వీటి పై దిశగా భారత్ రూపొందించుకున్న జాతీయ విధానాలను.. ఐరాస రూపొందించిన ఓ నివేదికలో ప్రస్తావించింది. బాలల ఆరోగ్య పరిరక్షణకు భారత్ అవలంబిస్తున్న విధానాలను కూడా ఆ నివేదికలో పేర్కొంది.