ధర్మశాల: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన భారత జట్టు వరుసగా 11వ టీ20 విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నేడు శ్రీలంకతో జరగనున్న మూడో టీ20లో కనుక విజయం సాధిస్తే భారత్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది.
ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. టీ20ల్లో వరుసగా 12 విజయాలు సాధించి రికార్డును తన పేరున రాసుకుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న మూడో టీ20లో శ్రీలంకను ఓడిస్తే వరుసగా 12 టీ20 విజయాలు సాధించిన జట్టుగా ఆఫ్ఘనిస్థాన్, రొమేనియా సరసన నిలుస్తుంది. 11 వరుస విజయాలతో ఉగాండా ఆ తర్వాతి స్థానంలో ఉంది.