అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి భారత్‌ నో

ABN , First Publish Date - 2021-01-24T08:43:37+05:30 IST

అణ్వాయుధాల నిషేధ ఒప్పందానికి మద్దతు ఇచ్చేది లేదని భారత్‌ స్పష్టంచేసింది. అణ్వాయుధాలున్నట్టు భావిస్తున్న 9 దేశాలు మాత్రం ఈ ఒప్పందానికి మద్దతు తెలపలేదు...

అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి భారత్‌ నో

న్యూఢిల్లీ, జనవరి 23: అణ్వాయుధాల నిషేధ ఒప్పందానికి మద్దతు ఇచ్చేది లేదని భారత్‌ స్పష్టంచేసింది. అణ్వాయుధాలున్నట్టు భావిస్తున్న 9 దేశాలు మాత్రం ఈ ఒప్పందానికి మద్దతు తెలపలేదు. నాటో కూటమిలోని దేశాలు కూడా మద్దతు ప్రకటించలేదు. అయితే అణ్వాయుధాల నిషేధ ఒప్పందం శుక్రవారం నుంచి అమలులోకి  రావడంతో భారత్‌ దీనిపై తన వైఖరిని స్పష్టంచేసింది. ‘‘అణ్వాయుధాల నిషేధ ఒప్పందంపై జరిగిన చర్చల్లో భారత్‌ పాల్గొనలేదు. అందువల్ల ఈ ఒప్పందంలో మేం భాగం కాబోం. అయినప్పటికీ ‘‘అణ్వాయుధ రహిత ప్రపంచ’’ సాధన కోసం భారత్‌ కట్టుబడి ఉంటుంది.’’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. 

Updated Date - 2021-01-24T08:43:37+05:30 IST