పేటెంట్ల దరఖాస్తులో భారత్‌కు ఎనిమిదో స్థానం

ABN , First Publish Date - 2021-02-27T09:11:49+05:30 IST

మేధో సంపత్తి హక్కుల దరఖాస్తులను దాఖలు చేయడంలో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం జాయింట్‌ సెక్రటరీ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

పేటెంట్ల దరఖాస్తులో భారత్‌కు ఎనిమిదో స్థానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మేధో సంపత్తి హక్కుల దరఖాస్తులను దాఖలు చేయడంలో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం జాయింట్‌ సెక్రటరీ సునీల్‌ కుమార్‌ తెలిపారు. విద్యా, పరిశోధన సంస్థలు, పరిశ్రమ కలిసి పని చేయడానికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయి. పరిశోధన, అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టే విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సి ఉందని టెక్నాలజీపై సీఐఐ, తెలంగాణ నిర్వహించిన సదస్సులో పేర్కొన్నారు. రక్షణ, ఏరోస్పేస్‌ బయోటెక్‌, ఫార్మా, పర్యావరణ టెక్నాలజీ రంగాల్లో భారత్‌, అమెరికా కలసి పని చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోల్‌ రిఫ్‌మన్‌ అన్నారు.  

Updated Date - 2021-02-27T09:11:49+05:30 IST