Abn logo
Sep 21 2021 @ 01:16AM

ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 46వ ర్యాంకులో భారత్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: వివిధ రంగాల్లో నవ్యత్వానికి పట్టం కడుతూ ర్యాంకులు కేటాయించే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌(జీఐఐ)లో భారత్‌ మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. 2021 సంవత్సరానికి ఈ సూచీలో మనదేశం 46వ స్థానంలో ఉంది. గతేడాదితో పోల్చుకుంటే 2 స్థానాలు మెరుగుపరచుకుంది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్‌ ఈ సూచీలో వేగంగా పైకి ఎగబాకింది. ఎలక్ట్రిక్‌ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, స్పేస్‌, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితర అంశాల్లో కొత్త ఆలోచనలను ప్రో త్సహించడం ద్వారా భారత్‌ ర్యాంకు మెరుగైందని నీతి ఆయోగ్‌ పేర్కొంది.