అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం ఇండియానే: రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-02-27T00:05:11+05:30 IST

ప్రపంచంలో మరో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించని ఒకే ఒక్క దేశం ఇండియా అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూ ఢిల్లీలో శనివారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ 98వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

అంగుళం భూమి కూడా ఆక్రమించని దేశం ఇండియానే: రాజ్‌నాథ్ సింగ్

ప్రపంచంలో మరో దేశానికి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించని ఒకే ఒక్క దేశం ఇండియా అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూ ఢిల్లీలో శనివారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ 98వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ఏ దేశంపైనా దురాక్రమణ చేయని దేశం ఇండియా అన్నారు. ‘‘భారత దేశానికి ఉన్న శక్తి ప్రపంచ సంక్షేమం కోసమే. ఏ దేశాన్నో భయపెట్టడం కోసం కాదు. మా లక్ష్యం దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే. దేశాన్ని శక్తివంతంగా, ఆర్థికంగా, ఉన్నత విలువలతో తీర్చిదిద్దాలనుకుంటున్నాం. 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా దేశ సమగ్రత, సమానత్వం, స్వేచ్ఛ గురించి తలచుకోవాలి. మన దేశానికి చెందిన ఎందరో గురువులు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించారు. జీసస్ పుట్టుకకు ముందే మన దేశంలో సర్జరీలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులకు రాజ్‌నాథ్ మెడల్స్ అందజేశారు. 

Updated Date - 2022-02-27T00:05:11+05:30 IST