Abn logo
Sep 26 2021 @ 00:51AM

భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి

ర్యాలీలో పాల్గొన్న ఎంపీ సత్యవతి


ఎంపీ సత్యవతి 

అచ్యుతాపురం, సెప్టెంబరు 25: భారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని అనకాపల్లి  ఎంపీ బీవీ సత్యవతి అన్నారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవం, ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌లో భాగంగా  శనివారం ఇక్కడ ప్రశాంతి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడారు.   అనంతరం కళాశాల నుంచి భారీ ర్యాలీని నిర్వహించారు.  ఎన్‌వైకే సంఘటన్‌  అధికారులు జి.మహేశ్వరరావు, కె.వెంకటరమణ, ప్రశాంతి విద్యాసంస్థల చైర్మన్‌ ధర్మిరెడ్డి ప్రసాద్‌,  సర్పంచు కూండ్రపు విమల నాయుడు, కె.శ్రీనివాసరావు, లీలా ప్రసాద్‌ పాల్గొన్నారు.