ఆ కల ఇప్పటికీ మిగిలే వుంది.. కేంద్రమంత్రి పియూష్ గోయల్..

ABN , First Publish Date - 2020-07-14T04:11:03+05:30 IST

భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న తమ లక్ష్యం ఇంకా నిలిచేవుందని..

ఆ కల ఇప్పటికీ మిగిలే వుంది.. కేంద్రమంత్రి పియూష్ గోయల్..

న్యూఢిల్లీ: భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న తమ లక్ష్యం ఇంకా నిలిచేవుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పునరుద్ఘాటించారు. ఇవాళ జరిగిన బాంబే చాంబర్స్ 184వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19 కారణంగా మనం కొంత సమయాన్ని కోల్పోవచ్చు... కానీ ఆ స్ఫూర్తి మాత్రం మిగిలేవుంది. ఉమ్మడి కృషితో మేము మళ్లీ ముందుకెళ్తాం...’’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణం వచ్చిందనీ.. అభివృద్ధిని మళ్లీ పట్టాలపైకి తీసుకురావాల్సి ఉందని గోయల్ పేర్కొన్నారు. ‘‘కొవిడ్-19కు పూర్వ స్థితిని మళ్లీ తీసుకొచ్చేందుకు భారత్ ఇప్పటికే బలమైన ప్రయత్నాలు ప్రారంభించింది...’’ అని మంత్రి వెల్లడించారు. 

Updated Date - 2020-07-14T04:11:03+05:30 IST