మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. నిలకడగా ఆడుతున్న కోహ్లీ

ABN , First Publish Date - 2022-02-19T01:30:23+05:30 IST

విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. పది ఓవర్లు ముగిసే సరికి మూడు

మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. నిలకడగా ఆడుతున్న కోహ్లీ

కోల్‌కతా: విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ తడబడుతోంది. పది ఓవర్లు ముగిసే సరికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.  ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి నిదానంగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు పెంచే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించిన తర్వాత 19 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. రోస్టన్ చేజ్ బౌలింగులో అవుటయ్యాడు.


అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 8 పరుగులు మాత్రమే చేసి రోస్టన్ చేజ్ బౌలింగులో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా నిదానంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిశాయి. టీమిండియా మూడు వికెట్ల  నష్టానికి 85 పరుగులు చేసింది. కోహ్లీ 38, రిషభ్ పంత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-02-19T01:30:23+05:30 IST