మంధాన మెరిసినా..

ABN , First Publish Date - 2020-02-13T10:13:10+05:30 IST

ఓపెనర్‌ స్మృతి మంధాన (37 బంతుల్లో 12 ఫోర్లతో 66) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగినా ఆస్ట్రేలియాతో ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్లో భారత్‌కు ఓటమి ...

మంధాన మెరిసినా..

ముక్కోణపు టీ20 టోర్నీలో ఆతిథ్య ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది..ఛేదనలో స్టార్‌బ్యాట్స్‌వుమెన్‌ స్మతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ జట్టును విజయం అంచులవరకు తీసుకొచ్చినా కీలక సమయంలో వీరిద్దరు నిష్క్రమించడంతో ఒత్తిడికి లోనైన భారత్‌ ఆపై వరుసగా వికెట్లు  చేజార్చుకుని ఓటమి పాలైంది..మరోవైపు మూనీకితోడు ఆఖర్లో హేన్స్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేయడంతో చివరి ఓవర్లో భారీగా పరుగులు రాబట్టిన ఆసీ్‌స..ప్రత్యర్థి ఎదుట సవాల్‌ చేసే లక్ష్యాన్ని ఉంచింది..అనంతరం స్పిన్నర్‌ జొనాసెన్‌ సంచలన బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బతీసి ట్రోఫీ అందుకుంది..


‘ముక్కోణపు’ ఫైనల్లో భారత్‌ ఓటమి

         ఐదు వికెట్లతో 

        దెబ్బతీసిన జొనాసెన్‌

మూనీ హాఫ్‌ సెంచరీ

11 పరుగులతో ఆస్ట్రేలియా గెలుపు


మెల్‌బోర్న్‌: ఓపెనర్‌ స్మృతి మంధాన (37 బంతుల్లో 12 ఫోర్లతో 66) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగినా ఆస్ట్రేలియాతో ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్లో భారత్‌కు ఓటమి తప్పలేదు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 11 పరుగులతో విజయం సాధించి టైటిల్‌ అందుకుంది.  ఈనెలలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌క్‌పనకుముందు ఆస్ట్రేలియాకు ఈ ట్రోఫీ ఆత్మవిశ్వాసం పెంచేదే.

టాస్‌  గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్‌ మూనీ (54 బంతుల్లో 9 ఫోర్లతో 71 నాటౌట్‌) వేగంగా ఆడింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26), గార్డ్‌నర్‌ (24 బంతుల్లో 5 ఫోర్లతో 26) పర్లేదనిపించారు. దీప్తిశర్మ (2/30), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/32) చెరో రెండు వికెట్లు సాధించారు. ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది.  మంధానకు తొలి టీ20 ఆడిన రిచా ఘోష్‌ (17), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14) మినహా ఎవరూ సహకరించలేకపోయారు. ఆసీస్‌ స్పిన్నర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జొనాసెన్‌ 12 పరుగులకు 5 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసింది. 


పటిష్ఠ స్థితి నుంచి: 156 పరుగుల ఛేదనలో 15 ఓవర్లో భారత్‌ స్కోరు 115/3. అప్పటికి 35 బంతుల్లో విజయానికి 41 పరుగులు కావాలి. మంధానతోపాటు కెప్టెన్‌ హర్మన్‌పీత్ర్‌ కూడా క్రీజ్‌లో ఉండడంతో భారత్‌ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ 15వ ఓవర్‌ రెండో బంతికి అవుటైనప్పటినుంచి పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ జెస్‌ జొనాసన్‌ సంచలన బౌలింగ్‌కు తెరదీసింది. నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం ద్వారా భారత్‌ విజయావకాశాలను దెబ్బ తీసింది. జొనాసెన్‌కు షట్‌, పెర్రీ తోడవడంతో చివరి ఏడు వికెట్లను భారత్‌ 29 పరుగులకు చేజార్చుకుంది. 


స్కోరు బోర్డు 

ఆస్ట్రేలియా: హీలీ (సి) భాటియా (బి) శర్మ 4, మూనీ (నాటౌట్‌) 71, గార్డ్‌నర్‌ (సి) గైక్వాడ్‌ (బి) అరుంధతి 26, లానింగ్‌ (సి) షఫాలి (బి) యాదవ్‌ 26, పెర్రీ (సి) శర్మ (బి) గైక్వాడ్‌ 1, సదర్లాండ్‌ (స్టంప్డ్‌) భాటియా (బి) శర్మ 7, హేన్స్‌ (సి) కౌర్‌ (బి) గైక్వాడ్‌ 18, కేరీ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం (20 ఓవర్లలో) 155/6. వికెట్ల పతనం: 1/4, 2/56, 3/107, 4/108, 5/121, 6/151, బౌలింగ్‌: దీప్తి 4-0-30-2, శిఖా పాండే 4-0-27-0, రాధా యాదవ్‌ 4-0-35-1, రాజేశ్వరి 4-0-32-2, అరుంధతి 4-0-31-1.

భారత్‌: షఫాలీవర్మ (సి) మూనీ (బి) వ్లామిన్క్‌ 10, స్మృతి మంధాన (సి) కేరీ (బి) షట్‌ 66, రిచా ఘోష్‌ (సి) వ్లామిన్క్‌ (బి) సదర్లాండ్‌ 17, జెమీమా రోడ్రిగ్స్‌ (సి) కేరీ (బి) వ్లామిన్క్‌ 2, హర్మన్‌కౌర్‌ (ఎల్బీ) జొనాసెన్‌ 14, దీప్తిశర్మ (సి) హేన్స్‌ (బి) జొనాసెన్‌ 10, అరుంధతి (సి) హీలీ (బి) జొనాసెన్‌ 0, శిఖాపాండే (సి) కేరీ (బి) పెర్రీ 4, రాధా యాదవ్‌ (సి) లానింగ్‌ (బి) జొనాసెన్‌ 2, తానియా భాటియా (సి) సదర్లాండ్‌ (బి) జొనాసెన్‌ 11, రాజేశ్వరీ గైక్వాడ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో) 144 ఆలౌట్‌. వికెట్లపతనం : 1/11, 2/54, 3/65, 4/115, 5/118, 6/118, 7/124, 8/127, 9/142, 10/144. బౌలింగ్‌: పెర్రీ 3-0-19-1, వ్లామిన్క్‌ 4-0-32-2, షట్‌ 4-0-28-1, గార్డ్‌నర్‌ 2-0-19-0, కేరీ 1-0-13-0, జొనాసెన్‌ 4-0-12-5, సదర్లాండ్‌ 2-0-21-1.

Updated Date - 2020-02-13T10:13:10+05:30 IST