భారత్‌లో కరోనా ఉధ‌ృతి! ఆసక్తి కలిగిస్తున్న అమెరికా యూనివర్శిటీ అధ్యయనం!

ABN , First Publish Date - 2020-05-23T18:52:09+05:30 IST

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిచిగన్ యూనివర్శిటీ అధ్యయనంలో పలు ఆసక్తి కర విషయాలు వెల్లడైయ్యాయి.

భారత్‌లో కరోనా ఉధ‌ృతి! ఆసక్తి కలిగిస్తున్న అమెరికా యూనివర్శిటీ అధ్యయనం!

ఆన్ఆర్బర్(మిచిగన్): భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిచిగన్ యూనివర్శిటీ అధ్యయనంలో పలు ఆసక్తి కర విషయాలు వెల్లడైయ్యాయి. భారత్‌లో విధించిన లాక్ డౌన్ కరోనాను అదపు చేయడంలో అధిక శాతం సఫలికృతమైందని యూనివర్శిటీ శాస్త్రవేత్తలు బృందం తెలిపింది. ఈ ఆంక్షల కారణంగా కేసుల సంఖ్యలో 66 శాతం మేర కోత పడిందని తెలిపింది.


కరోనా మహమ్మారికి సంబంధించి ఆర్ నాట్(R0) అనే ముఖ్యమైన ప్రాతిపదిక ఆధారంగా పరిశోధకుల బృందం ఈ అంచనాకు వచ్చింది. కరోనా బాధితుడి వల్ల సగటున ఎంతమందికి వ్యాధి సోకిందనే విషయాన్ని R0 సంఖ్య ద్వారా తెలుస్తోంది. ఈ సంఖ్య 2 గా నమోదైతే ప్రతి బాధితుడి వల్ల సగటున మరో ఇద్దరు వైరస్ బారినపడ్డారని అర్థం.


లాక్‌డౌన్ ప్రారంభ తేదీ మే 24న ఆర్‌నాట్ 3.36గా నమోదైనట్టు యూనివర్సటి జరిపిన అధ్యయం వెల్లడైంది. తొలివిడత లాక్ డౌన్ పూర్తాయ్యే నాటికి(ఏప్రిల్ 14) ఈ సంఖ్య 1.71కు తగ్గింది. మే 3 నాటికి(లాక్ డౌన్ 2.0) ఇది 1.46కి పడిపోగా లాడ్ డౌన్ 3.0 చివరిరోజైన మే 16న ఆర్ నాట్ అత్యల్పంగా 1.27కి చేరుకుందని యూనివర్శిటీ అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు.. మే 22న ఏకంగా 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఒక్కరోజులు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికంగా కావడంతో కరోనా ప్రబలుతోందన్న ఆందోళన దేశంలో పెరుగుతోంది. అయితే మిచిగన్ యూనిర్శిటీ శాస్త్రవేత్తల బ‌ృందం మాత్రం భారత్‌లో విధించిన లాక్ డౌన్ కరోనాను కట్టడి చేయగలిగిందని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-05-23T18:52:09+05:30 IST