బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టు (Rescheduled Match)లో భారత్ ఆధిక్యం 300 దాటింది. ఓవర్నైట్ స్కోరు 125/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 153 పరుగుల వద్ద పుజారా (Pujara) వికెట్ను కోల్పోయింది. 168 బంతులు ఎదుర్కొన్న పుజారా 66 పరుగులు చేసి బ్రాడ్ బౌలింగులో అవుటయ్యాడు. పుజారా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) మరోమారు విఫలమయ్యాడు. 19 పరుగులు మాత్రమే చేసి మాటీ పాట్స్ బౌలింగులో వెనుదిరిగాడు.
మరోవైపు క్రీజులో పాతుకుపోయిన తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రిషభ్ పంత్ (Rishabh Pant) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పంత్ 53, జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని భారత్ ఆధిక్యం 326 పరుగులకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి