ఫేవరెట్‌ భారత్‌

ABN , First Publish Date - 2021-10-22T08:58:55+05:30 IST

పొట్టి ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి మరో 24 గంటల్లో తెరలేవనుంది. నేరుగా సూపర్‌-12లో తలపడుతున్న టాప్‌ జట్లు వామప్‌ మ్యాచ్‌ల ద్వారా తమ బలాలు, బలహీనతలను తెలుసుకొని వాటిని సవరించుకొనే పనిలో నిమగ్నమయ్యాయి.

ఫేవరెట్‌ భారత్‌

దుబాయ్‌: పొట్టి ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి మరో 24 గంటల్లో తెరలేవనుంది. నేరుగా సూపర్‌-12లో తలపడుతున్న టాప్‌ జట్లు వామప్‌ మ్యాచ్‌ల ద్వారా తమ బలాలు, బలహీనతలను తెలుసుకొని వాటిని సవరించుకొనే పనిలో నిమగ్నమయ్యాయి. ఇకపోతే రెండు వామప్‌ పోటీల్లో బలమైన ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లను కంగుతినిపించిన కోహ్లీసేన సిసలైన సమరానికి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. రెండు వామప్‌ మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన టీమిండియాను మెగా టోర్నీ టైటిల్‌ ఫేవరెట్‌గా ఆసీస్‌, పాక్‌ మాజీ కెప్టెన్లు స్టీవ్‌ స్మిత్‌, ఇంజమాముల్‌ హక్‌ అంచనా వేస్తున్నారు. వామప్‌ మ్యాచ్‌లో కోహ్లీసేన 8 వికెట్లతో ఆసీ్‌సను చిత్తుచేసిన నేపథ్యంలో స్మిత్‌ స్పందిస్తూ ‘భారత్‌ అద్భుత జట్టు. అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది.


ఆ జట్టులో కొందరు మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు’ అని చెప్పాడు. ఇక టైటిల్‌ సాధించేందుకు కోహ్లీసేకు బాగా అవకాశాలున్నాయని ఇంజమామ్‌ బలంగా నమ్ముతున్నాడు. ‘ఏ టోర్నీలోనైనా ఫలానా జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు ఇంతశాతం ఉన్నాయని మాత్రమే అంచనా వేయగలుగుతాం. కానీ టీ20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచే చాన్స్‌ మరే జట్టుకన్నా భారత్‌కే ఎక్కువగా ఉంది. యూఏఈలో  పరిస్థితులు, టీమిండియాలో పలువురు అనువజ్ఞులైన టీ20 ప్లేయర్లుండడమే అందుకు కారణం’ అని హక్‌ వివరించాడు.  

Updated Date - 2021-10-22T08:58:55+05:30 IST