భారత్‌ ఎప్పుడూ శాంతివైపే: జైశంకర్‌

ABN , First Publish Date - 2022-04-07T09:42:49+05:30 IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి భారత్‌ వ్యతిరేకమని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశా రు.

భారత్‌ ఎప్పుడూ శాంతివైపే: జైశంకర్‌

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి భారత్‌ వ్యతిరేకమని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశా రు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎవరి పక్షాన నిలబడాలన్న ప్రశ్న వస్తే.. భారత్‌ ఎప్పుడూ శాంతివైపే ఉం టుందని చెప్పారు. హింసకు తక్షణమే ముగిం పు పలకాలనే కోరుకుంటామన్నారు. ఉక్రెయిన్‌ నుంచి పౌరులను వెనక్కి రప్పించిన తొలి దేశం మనదేనని, ఈ విషయంలో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచామని జైశంకర్‌ చెప్పారు. బుచాలో మారణహోమం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. హత్యలపై స్వతంత్ర విచారణ జరపాలన్న డిమాండ్‌కు భారత్‌ మద్దతిస్తుందన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చ లు జరగాలనే కోరుకుంటున్నామని, ఈ విషయంలో సాయం చేయమంటే సంతోషంగా చేస్తామని వెల్లడించారు. 

Updated Date - 2022-04-07T09:42:49+05:30 IST