బ్యాంకుల్లో నిధులు ఉన్నాయ్.. కార్పొరేట్లే సిద్ధంగా లేరు: ఎస్‌బీఐ చైర్మన్ వ్యాఖ్య

ABN , First Publish Date - 2020-06-03T21:55:01+05:30 IST

భారత్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే.. భారత కార్పొరేట్ సంస్థలు నష్ట భయాన్ని వదిలి మరింతగా పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.

బ్యాంకుల్లో నిధులు ఉన్నాయ్.. కార్పొరేట్లే సిద్ధంగా లేరు: ఎస్‌బీఐ చైర్మన్ వ్యాఖ్య

ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే.. భారత కార్పొరేట్ సంస్థలు నష్ట భయాన్ని వదిలి మరింతగా పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు. బ్యాంకుల వద్ద నిధులు దండిగా ఉన్నాయని అయితే రుణాలు తీసుకునేందుకు కార్పొరేట్ సంస్థలే ముందుకు రావట్లేదని తెలిపారు. ‘నష్టం భయం రుణాలిచ్చే సంస్థల్లోనే ఉందా? రుణగ్రహీతల్లో లేదా? పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతిగా చెబుతున్నా.. నా దగ్గర నిధులు ఉన్నాయి. కానీ రుణాలు తీసుకునే వాళ్లే లేరు’ అని రజశీశ్ సీఐఐ సమావేవంలో వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-06-03T21:55:01+05:30 IST