సంపన్నుల సంఖ్యలో భారత్‌దే పైచేయి

ABN , First Publish Date - 2021-02-25T06:14:33+05:30 IST

దేశంలో అధిక విలువ గల సంపన్నుల (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య రాబోయే ఐదేళ్లలో 63 శాతం పెరిగి 11,198కి చేరవచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ

సంపన్నుల సంఖ్యలో భారత్‌దే పైచేయి

ఐదేళ్లలో 63 శాతం వృద్ధి అంచనా


న్యూఢిల్లీ : దేశంలో అధిక విలువ గల సంపన్నుల (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య రాబోయే ఐదేళ్లలో 63 శాతం పెరిగి 11,198కి చేరవచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీరి సంఖ్య 5,21,653 ఉండగా భారత్‌లో 6,884 మంది ఉన్నారు. మూడు కోట్ల డాలర్లు (రూ.225 కోట్లు), ఆ పైబడి సంపద ఉన్నవారిని అధిక నికర విలువ గల సంపన్నులుగా పరిగణనలోకి తీసుకున్నారు.


2020-25 మధ్య కాలంలో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య ప్రపంచంలో 27 శాతం పెరిగి 6,63,483కి చేరవచ్చని అంచనా వేసింది. భారత్‌లో కుబేరుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కూడా పేర్కొంది. అలాగే కుబేరుల సంఖ్య కూడా 43 శాతం పెరిగి 113 నుంచి 162కి చేరుతుందని అంచనా వేసింది. కుబేరుల సంఖ్యలో ప్రపంచ వృద్ధి రేటు 24 శాతం, ఆసియా వృద్ధి రేటు 38 శాతం ఉండవచ్చని, భారత్‌లో వృద్ధి రేటు అంతకన్నా ఎంతో అధికమని పేర్కొంది. నగరాల వారీగా చూస్తే ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో సంపద కేంద్రీకృతమై ఉన్నదని నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది.  


Updated Date - 2021-02-25T06:14:33+05:30 IST